News

ప్రతి ఇంటికి నల్లా:కేసీఅర్


హైదరాబాద్‌ మంచినీటి సరఫరా పై సోమవారం క్యాంపు కార్యాలయం లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిం చారు. హైదరాబాద్‌ నగరంలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీళ్లు అందివ్వడమే లక్ష్యంగా సరైన ప్రణాళికతో ముందుకు పోవా లని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని తరలించి మంచినీటిని అ ందించాలని అన్నారు. మంజీ రా నుంచి త్వరలో అందే కృష్ణా, గోదా వరి నీటిని కూడా కలుపుకుంటె ముప్పై రెండు టిఎంసిలు అందుబాటులోకి వస్తాయ న్నారు. గోదావరి నుంచి మరిన్ని నీళ్ళను తరలించాలన్నారు. దీని కోసం ప్రత్యేక రిజర్వాయర్లు నిర్మించాల న్నారు. నగరంలో దాదాపు తొమ్మిది లక్షల నల్లా కనెక్షన్లు వ్నునాయన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మున్సిపల్‌ శాఖ కార్యదర్శి ఎంజి.గోపాల్‌, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, జీహెచ్‌ఎంసి కమి షనర్‌ సోమేష్‌కుమార్‌, హెచ్‌ఎండబ్లు్యస్‌ ఎండి.జగదీశ్వర్‌, చీఫ్‌ ఇంజనీర్‌ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.